ఏపీ ఆర్థిక పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పీఎఫ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో మాత్రం జగన్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారితపై పురంధేశ్వరి విమర్శలు కురిపించారు. అసలు ఏం అర్హత ఉందని, వైసీపీ నాయకులు సాధికారిత యాత్ర చేస్తున్నారని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఇసుక, మైనింగ్, మద్యం అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. సీఎం జగన్ సొంత పాలనను కొనసాగిస్తూ అన్ని వర్గాలను, రంగాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకంపైనా సీఎం జగన్ స్టిక్టర్లు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
జగన్ పాలన పై ఆందోళన వ్యక్తం చేసిన పురంధేశ్వరి..
52
previous post