కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ పంట పొలాలలో విచిత్రంగా ఉన్న అడుగులను చూసి స్థానిక రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
అరటి తోటలో అరటి చెట్ల పైకి గోర్లతో పాకిన వైరాన్ని గుర్తించిన రైతులు స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలుపగా అటవీ శాఖ అధికారులు సంబంధిత ప్రాంతానికి వచ్చి పర్యవేక్షించారు. అడుగులను, సంచరించిన ప్రదేశాన్ని, ధ్వంసం చేసిన అరటి చెట్లను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం అరటి తోటలో వరుసగా ఏడు ఎనిమిది చెట్లను ధ్వంసం చేసి వున్నాయని, దాన్ని అడుగులు పరిశీలిస్తే పెద్దవిగా ఉన్నాయని ఏదో అడవి జంతువేమో అని భయముగా ఉందని తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని తక్షణమే వారు స్పందించి ఈ ప్రదేశాన్ని పరిశీలించారని అన్నారు. ఇది ఏ జాతికి చెందిదో గుర్తించి మా రైతులకు భయం లేకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.
అరటి తోటలను ధ్వంసం చేస్తున్న వింత జంతువు..
70
previous post