రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తెలంగాణలో ఎన్నికలు, అలాంటి వేళ సరిగ్గా అర్ధరాత్రి వేళ హైడ్రామా ఎన్నికలలో లబ్ది కోసమే కేసీఆర్ చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తూచా తప్పకుండా పాటించారని అర్ధరాత్రి సమయంలో హైడ్రామాకి తెర తీసారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడారు. ఇవన్నీ కేంద్ర పరిధిలోని అంశాలు. రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అంశాలు. కానీ వందల మంది పోలీసులతో వెళ్లి ప్రాజెక్టు వద్ద బీభత్సం సృష్టించడం వలన ఒరిగేది ఏమీ లేదు. పైగా సిబ్బందిపై దాడి, సీసీ కెమెరాల ధ్వంసం వంటి చర్యలతో ప్రజల సొమ్మే నష్టపోయింది. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం చూస్తే.. ఇది కావాలని పక్కా ప్రణాళికతో చేసిన చర్యగానే కనిపిస్తుందన్నారు. పోలీసులే పనిగట్టుకొని వెళ్లి అల్లర్లు జరిగేలా ప్రేరేపించడం వెనక పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను ప్రభావం చేయాలన్న దురుద్దేశమే అని ఆరోపించారు. ఇంత కాలం నిమ్మకు నీరెత్తునట్లుగా ఉండి సరిగ్గా తెలంగాణ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం ఈ రకమైన దూకుడు ప్రదర్శించడం పొరుగు రాష్ట్రంలో తన మిత్రుడికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికేనని, ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్ చేసిన ఈ చర్య వల్ల ఇటు ఏపీలో జగన్ సర్కార్ రైతాంగం సమస్యల పట్ల పొరుగు రాష్ట్రంతో గొడవకు సైతం వెనుకాడటం లేదన్న భావన ప్రజలలో కలిగేలా చేయడంతో పాటు.. పొరుగు రాష్ట్రంలో సెంటిమెంట్ ను రగిల్చి అక్కడి తన మిత్రుడికి లబ్ధి చేకూర్చాలన్న కుట్ర కూడా దాగి ఉందని ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మాట్లాడారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్..
44
previous post