సుండుపల్లి మండలం బెస్తపల్లి దగ్గర ఆగి ఉన్న ద్విచక్ర వాహన దారుడు రామచంద్ర నాయక్ ను తిరుపతి నుంచి సుండుపల్లికి వస్తున్న ఆర్టిసి బస్సు డి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రామచంద్ర నాయక్ ను ఆసుపత్రికి తరలించేందుకు 108 కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోకలేక పొయ్యింది. మానవత స్వచ్చంద సంస్థ వారికీ చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన మానవత అంబులెన్స్ చోదకుడు చంటి ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని రామచంద్ర నాయక్ ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వారికీ ప్రాధమిక వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలంటూ సూచించారు. ప్రమదం జరిగిందని సమాచారం ఇచ్చిన వెను వెంటనే సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి చేర్పించిన మానవత సభ్యులకు, అంబులెన్స్ చోదకుడు కి వారి కుటుంబ సభ్యులు స్థానికులు ప్రసంసాభినందనలు తెలియజేశారు. గాయపడిన రామచంద్ర నాయక్ డి వాయిల్ దొడ్డి బిడికి గా పోలీసులు గుర్తించారు. సుండుపల్లి పోలీసులు జరిగిన సంఘటన పై కేసు నమోదు చేశారు.
సేవా కార్యక్రమంలో దూసుకుపోతున్న మానవత స్వచ్ఛంద సంస్థ ..
82
previous post