76
అరేబియా సముద్రంలో 40 మంది మత్సకారులతో వెళ్తున్న బోటు గల్లంతైన ఘటన కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా కర్వార్‌లో జరిగింది. ఈ బోటు గోవాలోని పనాజీ నుంచి బయలుదేరిందనీ, ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలోని బెలికేరి సమీపంలో చివరి జీపీఎస్ సిగ్నల్ నమోదైందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బోటులో మొత్తం 40 మంది ఉన్నారు. గోవాలో రిజిస్టర్ అయిన ఈ బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి బలమైన గాలులకు కొట్టుకుపోయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన బోటు ఆచూకీ కోసం కోస్టల్ గార్డులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.