ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తుఫాన్ కారణంగా డివిజన్ పరిధిలో 5 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విక్రయించేందుకు కళ్ళాల్లో ఆరపోసిన ధాన్యం తడిచిపోతుండటం తో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు విక్రయించే సమయానికి కురుస్తున్న వర్షాలు తమను తీవ్రంగా నష్టపరుస్తున్నయి అని వాపోతున్నారు. ధాన్యం తడిచిపోకుండ పట్టాలు కప్పుతూ, నీటిని తోడివెస్తు తంటాలు పడుతున్నారు. మరోవైపు వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్నారు.
Read Also..