నస్పుర్ పట్టణంలోని కలెక్టరేట్ కు సమీపంలోని 42 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి లో నిర్మించిన అక్రమ కట్టడాలను పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా కూల్చివేశారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎక్స్‌కావేటర్లతో చేరుకుని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో నిర్మాణదారులు అడ్డుపడి ఆందోళన చేపట్టారు. రాత్రికి రాత్రే ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం తో కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేశారు. అధికారులు కొందరు రియాల్ టర్లు ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములలో దర్జాగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి వాహనాలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ తాసిల్దార్ వనజ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, నస్పూర్ సిఐ సంజీవ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ కట్టడాల కూల్చివేత..
59
previous post