సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) :
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్లో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ను ఓడించాలని మోడీ, కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. డిసెంబర్లో ఒక దొంగను ఓడగొట్టామని సెటైర్ వేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీఐ పరిశ్రమను మోడీ, కేడీ కలిసి మూయించారని… త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీ ఓపెనింగ్ చేయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని.. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని.. ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…
- ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల…
- రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేల విజ్ఞప్తి.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తగిన నీటి కేటాయింపులు జరపాలని, జిల్లా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి నేతృత్వంలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి…





Total views : 214625