సీఎం జగన్ ఆరోగ్యశ్రీ కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్సకు, 5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ దీనిని ప్రకటించారు. అర్హులందరికీ ఈ పెంపు వర్తించనుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా మొదలుకానుంది. ఈనెల 19 నుంచి నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ కార్డుల పంపిణీ జనవరి నెలాఖరు వరకు జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కింద జనవరి ఒకటి నుంచి మలివిడత వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వాసుల కిడ్నీ సమస్యల పరిష్కారానికి నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును, సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. కిడ్నీ వ్యాధి బాధితులకు చికిత్స అందించడంతో పాటు, సమస్య రాకకు గల కారణాలపై పరిశోధనలకు, 85 కోట్ల వ్యయంతో నిర్మించిన కిడ్నీ రీసెర్చి సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
Read Also..
Read Also..