తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని రాచర్ల గ్రామానికి చెందిన రైతులు అపోలో టైర్ల పరిశ్రమకు భూములు ఇచ్చిన ఇప్పటివరకు పరిహారం అందని బాధితులు పరిహారం కోసం రిలే నిరాహార దీక్ష మరియు రాస్తారోకో చేపట్టారు . గత ఐదు సంవత్సరాలుగా తమకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమని ఈ నెల చివరి లోపల పరిహారం ఇవ్వకపోతే అపోలో పరిశ్రమను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల క్రితం తాము అపోలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రాగా అప్పట్లో 374 ఎకరాలు ప్రభుత్వం పరిశ్రమకు కేటాయించిగా అందులో రాచర్ల గ్రామానికి చెందిన రైతులు 75 మంది 75 ఎకరాల భూమిని ఇచ్చారని, ఈ 75 మంది రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేకపోవడం దారుణమని, పరిహారం కోసం జిల్లా కేంద్ర కార్యాలయానికి, నియోజకవర్గం కార్యాలయానికి, మండల కేంద్ర కార్యాలయానికి తిరిగి తిరిగి అలిసిపోయామని, గతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన అప్పట్లో వాగ్దానాలు చేసి వెళ్ళారే తప్ప తమకు పరిహారం అందలేదని, వెంటనే తమకు పరిహారం అందేలా చూడాలని లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Read Also..