తిరుమల ఆస్థాన మండపం ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని ఉద్యోగులు రోడ్డెక్కారు. పెండింగ్ జీతాలు టిటిడి యాజమాన్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గురూజీ మేన్ పవర్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. నిరసన చేస్తున్న ఉద్యోగులకు విజిలెన్స్, హెల్త్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మంగళవారం వరకు టైం ఇవ్వండి అంటూ హెల్త్ ఆఫీసర్ కోరారు. ముంబైలో ఉండే సంస్థ వారితో మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వారి మీద పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వాలి అని హెల్త్ ఆఫీసర్ ఉద్యోగులకు నచ్చ చెప్పారు. కాంట్రాక్టర్ కి ఇచ్చిన తర్వాత జీతాల విషయం మాకు సంబంధం లేదని అన్నారు. అయినా వారితో మాట్లాడి చూస్తాం లేనిచో వారి సంస్థను రద్దుచేసి వేరే వారికి ఇవ్వడమా అనే దానిపై ఆలోచిస్తాం అని హెల్త్ ఆఫీసర్ తెలిపారు.
Read Also..
Read Also..