కృష్ణాజిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గం.. మిచాంగ్ తుఫాన్ మిగిల్చిన నష్టంతో మనస్థాపానికి గురై అవనిగడ్డ నియోజకవర్గంకు చెందిన మరో కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన తక్కెళ్ల శ్రీ వెంకట పూర్ణయ్య (37) తనకున్న కొద్దిపాటి పొలానికి తోడు మరో పద్నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండగా మీచాంగ్ తుఫాను కారణంగా వీచిన గాలులకు సాగు చేస్తున్న వరి పొలం మొత్తం పడిపోవడంతో కోత కోసేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దీనితో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక పూర్ణయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు రైతు భార్య నాగ ఉష తెలిపారు. పూర్ణయ్య ఆత్మ హత్యాయత్నం సమాచారాన్ని తెలుసుకున్న మండలి బుద్ధప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, జనసేన నాయకుడు రాయపూడి వేణుగోపాల్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో ప్రభుత్వం వారికి తగిన భరోసా కల్పించడంలో విఫలం కావడంతో రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అని దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు కుటుంబానికి ఆంధ్ర అసోసియేషన్ వారు అందించిన 25వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బుద్ధప్రసాద్ అందించారు.
రైతన్న ఆత్మహత్యాయత్నం..
54
previous post