కలికిరి పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం కలికిరిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. కార్వేటినగరం మండలం, ఈదురు వారిపల్లికి చెందిన పెయింటర్ వెంకటేష్ కుమార్తె పవిత్ర అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం, కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ చదువుతోంది. హాస్టల్ గదిలో ఆమె ఉరి వేసుకుని మృతి చెందడంతో సహచరులు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. ప్రిన్సిపాల్ సమాచారం అందించడంతో వారు ఘటన స్థలము దగ్గర చేరుకునే మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Attempt suicide
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి వంతెన పైనుండి భార్యాభర్తలు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటాన్ని స్థానిక మత్స్యకారులు గమనించి భర్తను రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం భార్య మృతదేహం లభ్యమైంది. ఈనెల 16వ తేదీన ఇరువురికి వివాహమైందని అయితే పెళ్లైన నాలుగు రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణాజిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గం.. మిచాంగ్ తుఫాన్ మిగిల్చిన నష్టంతో మనస్థాపానికి గురై అవనిగడ్డ నియోజకవర్గంకు చెందిన మరో కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన తక్కెళ్ల శ్రీ వెంకట పూర్ణయ్య (37) తనకున్న కొద్దిపాటి పొలానికి తోడు మరో పద్నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండగా మీచాంగ్ తుఫాను కారణంగా వీచిన గాలులకు సాగు చేస్తున్న వరి పొలం మొత్తం పడిపోవడంతో కోత కోసేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దీనితో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక పూర్ణయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు రైతు భార్య నాగ ఉష తెలిపారు. పూర్ణయ్య ఆత్మ హత్యాయత్నం సమాచారాన్ని తెలుసుకున్న మండలి బుద్ధప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, జనసేన నాయకుడు రాయపూడి వేణుగోపాల్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో ప్రభుత్వం వారికి తగిన భరోసా కల్పించడంలో విఫలం కావడంతో రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అని దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు కుటుంబానికి ఆంధ్ర అసోసియేషన్ వారు అందించిన 25వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బుద్ధప్రసాద్ అందించారు.
సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. తన చావుకు సీఎం జగనే కారణమని ఐదు పేజీల లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. లేఖలో సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ, సీపీఎస్ రద్దు చేయాలంటూ, 5 వ తేదీకల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో వెల్లడించారు.
తనపై దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని, తనకు న్యాయం జరగాలంటూ ఓ వ్యక్తి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్టు ఆవరణలో కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. వెంటనే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన మహేష్ అనే లాయర్ పై ఇటీవల దాడి జరిగింది. ఈ సంఘటనలో మేకల పోశం తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం తనపై కూడా దాడి జరిగింది, అంటూ మేకల పోశం పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడంలేదని, అలాగే లాయర్లు అందరూ తమకు వ్యతిరేకంగా ఉన్నారని ఆవేదన చెందాడు. ఇదే క్రమంలో ఈరోజు కోర్టు కు వెళ్లి కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా పోచం కుమారుడు మాట్లాడుతూ తమపై కూడా దాడి జరిగిందని… అయితే ఇటు పోలీసులు పట్టించుకోకపోగా లాయర్లు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని తమకు న్యాయం జరగాలని పేర్కొన్నారు.
Read Also..
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం, డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ(37) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కు ప్రయత్నించింది. హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవల విభాగంలో నర్సులు డాక్టర్ కు ఫోన్ చేసి, డాక్టర్ చెప్పిన విధంగా వైద్యం అందించారు. డాక్టర్ లేకుండా నర్సులు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి రావడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నంకి పాల్పడ్డాడు. భార్య దుర్గా కాపురానికి రాలేదని విజయవాడ కు చెందిన భర్త మణికంఠ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. పోలీస్ సిబ్బంది మంటలు ఆర్పీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.






Total views : 78671