ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తెలంగాణలో మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణాలో నిన్న మరో 10 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో 9, కరీంనగర్ లో ఒక కేసు నిర్ధారణ అయినట్లు తెలిపారు. తాజాగా పది కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 55 కు చేరింది. అయితే తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ జేఎన్-1 కేసులు నమోదు కాలేదని డిహెచ్ రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ వాడితే మంచిదని రవీంద్ర నాయక్ సూచించారు.
62
previous post