భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజల పక్షాన నిరంతరం అలుపెరుగని పోరాటాలు చేస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య అన్నారు. సిపిఐ 99 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కందుకూరు పట్టణంలోని అన్ని శాఖలలో పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారాన్ని కైవసం చేసుకున్న నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనిని కూడా చేయకుండా వారి సొంత స్వలాభాల కోసం దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినిందని ఆయన ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు చేసి దాని ఫలితంగా కార్మిక, కర్షకులకు కనీస వేతన చట్టాన్ని అమల్లోకి తీసుకొని రావటం జరిగిందని ఆయన అన్నారు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు అలసిపోయారని, కమ్యూనిస్టుల అన్నను ప్రజలు కోరుకుంటున్నారని దాని ఫలితంగా మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో సిపిఐ పార్టీ ని గెలిపించుకున్నారని ఆయన అన్నారు. రానున్న 100వ ఆవిర్భావ దినోత్సవ సమయానికి రాష్ట్రంలో అత్యధిక సీట్లను కైవసం చేసుకునే దిశగా ప్రజా పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని శాఖలలో ఆయా శాఖ కార్యదర్శులు రానున్న ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాలను అవగాహన చేసే దిశగా పనిచేయాలని ఆయన కోరారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక సీట్లను గెలిపించుకునేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి పి బాలకోటయ్య, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఎర్రంశెట్టి ఆనందమోహన్, సిపిఐ నాయకులు బొల్లోజుల బాల బ్రహ్మచారి, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, రవి, రాము, ఉప్పుటూరి మాధవ రావు, బొల్లోజుల మణికంఠ, డి.ఆదినారాయణ, యనమల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై సీపీఐ అలుపెరుగని పోరాటం చేస్తుంది- రావుల వెంకయ్య
66
previous post