మనిషి సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలు. ఇది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. 110 ఏళ్లు జీవించి రికార్డులకెక్కిన వారూ ఉన్నారు. మరి ఏకంగా రెండు మూడు వందల సంవత్సరాలు జీవించే అవకాశం వస్తే అబ్బా! ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది. అయితే, ఆ కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. శరీరంలో పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా 200, 300 సంవత్సరాలు జీవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్లో నిన్న జరిగిన 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తుపాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు? ఎక్కడ? వస్తాయన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ఏడాది పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలను గ్రహాల కక్ష్యలోకి పంపుతున్నట్టు వివరించారు. మానవులను అంతరిక్షంలోకి పంపే మిషన్ గగన్యాన్ను ఈ ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు రోబోటిక్ పరిజ్ఞానంపై పెంచుకుని అత్యాధునికరోబోలు సృష్టిస్తే అంగారక, శుక్ర గ్రహంపై ఇస్రో చేపట్టే ప్రయోగాలలో వినియోగించుకుంటామని చెప్పారు.
300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయ్ – ఇస్రో చైర్మన్
60
previous post