57
రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో చందనవెల్లి గ్రామంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్బంగా చందనవెల్లి భూ బాధితులు భట్టి విక్రమార్కని కలిశారు.చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో అవకతవకలతో భూసేకరణ జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరగా, సమగ్ర విచారణ చేయిస్తానని హామి ఇచ్చారు. చందనవెల్లిలో సోలార్ పరిశ్రమను ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భట్టి తెలిపారు.