కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొఱ్ఱపాడు రోడ్డులోని ఆకృతి షాపింగ్ మాల్ లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఫైర్ అధికారులు సిబ్బంది శ్రమించి షాపింగ్ మాల్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లను మంటలు ఆర్పేందుకు తీసుకొచ్చారు. అయితే లోపల ఎంతవరకు నష్టం జరిగింది, ఎక్కడ షార్ట్ షాట్ క్యూట్ జరిగిందన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయి మంటలు అదుపులోకి తెచ్చి, పొగ ఆగితే తప్ప, నష్టం ఏమిటో తెలిసే పరిస్థితి లేదు. అయితే మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది ఒకరు పొగ దాటికి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆ సిబ్బందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తర్వాత అగ్నిమాపక అధికారులు సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చి పొగ తగ్గితే తప్ప లోపలికి వెళ్లి చూడలేని పరిస్థితి ఉందని పైర్ అధికారులు, చెబుతున్నారు. కోట్ల రూపాయలు విలువైన బట్టలు మంటలలో కాలిపోయాయి, ఆకృతి యాజమాన్యం కన్నీరు మున్నీరు అవుతోంది.
షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం..
65
previous post