జ్ఞానవాపి కేసు సంచలన మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలోకి హిందూ దేవుళ్ల ప్రతిమలకు పూజలు చేసుకునేందుకు హిందువులకు కోర్టు అనుమతి ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అందుకు జిల్లా యంత్రాంగం వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్పు చారిత్రాత్మకమైనది. 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణమోహన్ పాండే ఆదేశాలిచ్చారు. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌ను తెరవాలని ఆదేశాలు వచ్చాయి. రామ జన్మభూమిలాగే ఈ వివాదంలోనూ హిందువులు విజయం సాధిస్తారని హిందూ వర్గం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు. వారణాసి కోర్టు తాజా ఉత్తర్వులను హిందువుల విజయంగా కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణించింది. కోర్టు ఉత్తర్వులతో సీల్ చేసిన మసీదు బేస్‌మెంట్ ప్రాంతంలో ఉన్న హిందూ దేవత విగ్రహాలకు పూజలను ప్రారంభిస్తామని పేర్కొంది. కాశీ ఆలయ పూజారులే పూజలు నిర్వహిస్తారని తెలిపింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడ ASI సర్వే నిర్వహిస్తున్నందున బేస్‌మెంట్‌ను సీల్ చేసిన విషయం తెలిసిందే. ఐతే కోర్టు తాజా ఉత్తర్వులతో బేస్‌మెంట్ బారీకేడ్లను తొలగించనున్నారు.
జ్ఞానవాపి కేసు సంచలన మలుపు…
57
previous post