అనంతపురం జిల్లా వజ్రకరూరు విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తనకున్న ఒకటిన్నర ఎకరా పొలంలో రెండు సంవత్సరాల క్రితం బోరు వేయించారు. విద్యుత్ సప్లై కొరకు ట్రాన్స్ఫార్మర్ కోసం ఏడాది క్రితం అప్లై చేశారు. ట్రాన్స్ఫార్మర్ తో పాటు మెటీరియల్ మంజూరు అయినప్పటికీ ఏఈ చంద్రశేఖర్ రైతు ఆనంద్ ను రూ 30000/- లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రైతు నేను అంత ఇచ్చుకోలేను రూ.20 వేల రూపాయలు ఇచ్చే విధంగా భేరసారాలు కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన విషయాన్ని ఏసిబి అధికారులకు తెలియజేశారు. ఇ తరుణంలో ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బును రైతు ఆనంద్ గురువారం రాత్రి గుత్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఈ ని కలిసి లంచమిస్తుండగా ముందుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఏఈ చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.20000 నగదును స్వాధీనం చేసుకొని గుత్తి పట్టణంలోని APSPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయానికి తరలించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ అనంతరం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read also..