జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై దాడిచేసిన ఇరాన్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇటీవల ఇరాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బైడెన్ ప్రభుత్వం ప్రతీకార దాడులకు దిగింది. నిన్న ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద స్థావరాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డులను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలు దాడులకు దిగాయి. నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలిపింది. ఈ వైమానిక దాడిలో దీర్ఘశ్రేణి బాంబర్లు పాల్గొన్నాయి. జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ తమ స్పందన మొదలైందని, ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు.
జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇటీవల ఉగ్రవాదుల దాడి
53
previous post