తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రైతులకు కొన్ని అపోహలు కొందరు కల్పించారు. అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాకంవల్ల కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఉత్తమ్ అన్నారు. కానీ, గత పదేళ్లలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ అన్యాయం చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. Go 203 ద్వారా ఏపీ రాయలసీమ ప్రాజెక్టు చేపట్టారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సైలెంట్ గా ఉందన్నారు. రాయలసీమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం పై ఆధారపడిన తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నర్దాకనంగా మారాయని ఉత్తమ్ అన్నారు. 2014 తర్వాత 1200 టీఎంసీల నీరు బయట బేసిన్ లకు తరలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీటి తరలింపు పెరిగిందన్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.