ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రులతో రైతుల చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు మార్చ్ చేపట్టాలని పిలుపునివ్వడంతో పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ నుంచి ట్రక్కులు, ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీ వైపుగా బయలుదేరారు. దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. హర్యానాలోని 7 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. అంతేగాక సింఘు, తిక్రీ, ఘాజీపూర్ బార్డర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుపై మేకులను బిగించారు. కాగా, కనీస మద్దతు ధరకు చట్టం తీసుకురావడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతు రుణమాఫీ చేయాలని రైతు సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.