తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామి వారు. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
రథసప్తమి వేడుకల్లో ప్రధమ వాహనంగా సూర్య నారాయణుడు సూర్య ప్రభా మధ్య వస్తు డై దివ్య కిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలూ పేర్కొంటున్నాయి.
ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ(Surya Prabha Vahanam)…
ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ మొదలైంది. అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకున్నారు శ్రీవారు. సూర్యోదయాన భానుడి తొలికిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పృశించాయి. ఈ ఘట్టంను కనులారా తికలించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. ఆలయ
మాడవీధులంతా గోవిందా అనామ స్మరణతో మారుమ్రోగింది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అదే సమయంలో గ్యాలరీల్లో వేచివున్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామి వారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు. ఇక 108 సార్లు ఆదిత్య హృదయం పిల్లల చే పఠించడం అనవాయితీగా వస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.