సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నళిని చిదంబరం, అభిషేక్, సుమిత్ రాయ్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ను ప్రత్యేకంగా విచారిస్తామని పేర్కొంది. ఈ నెల 28న కేసు మొత్తం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కాగా తనను ఇంటి వద్దే విచారించాలని పిటిషన్ లో పేర్కొంది. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై కవిత అభ్యంతరం తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.