ఇక డిజిటల్ లావాదేవీలు పెరిగిన తరుణంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ లు మన నగదు అవసరాలను తీరుస్తూ నిత్యం లావాదేవీలకు ఉపయోగపడుతున్నాయి. మన నిత్యావసరాలు మొదలుకొని, కరెంట్ బిల్లులు కట్టడం, ఇన్సూరెన్స్ లు కట్టడం, షాపింగ్ చేయడం, మొబైల్ రీఛార్జ్ వంటివి చేయడం కోసం డిజిటల్ పేమెంట్ విధానాన్ని మన ఉపయోగించుకుంటున్నాం.
ఇది చదవండి: అంతరిక్షంలోకి మొట్ట మొదటిసారి చెక్కతో చేసిన శాటిలైట్!
ఇక ఈ క్రమంలో తాజాగా గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నట్టు గూగుల్ ప్రకటన చేసింది. అయితే ఇది వినడానికి కాస్త షాకింగ్ గా అనిపించినా ఈ ప్రకటన మనకు మాత్రం కాదు అన్నది ముఖ్యంగా భారతీయులు తెలుసుకోవలసిన అంశం. జూన్ నెల నుండి యూఎస్ లో గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి. అక్కడ జూన్ 4వ తేదీ నుండి గూగుల్ పే షట్ డౌన్ చేయబడుతుందని గూగుల్ వెల్లడించింది.
Follow us on : Facebook, Instagram & YouTube.