టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, బాబు రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
ఇది చదవండి: నేడు చంద్రబాబు పర్యటన..!
ఈ మేరకు ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలను ధర్మాసనానికి వినిపించారు. అయితే, రోహత్గి వాదనలపై కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం విచారణను మరో 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.