Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పై మంత్రి రోజా సెటైర్లు

టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పై మంత్రి రోజా సెటైర్లు

by Satya
Minister Roja


టీడీపీ -జనసేన(TDP-JanaSena) అభ్యర్థుల ఉమ్మడి జాబితా:

టీడీపీ -జనసేన(TDP-JanaSena) అభ్యర్థుల ఉమ్మడి జాబితా‎ను చూసి ఆ పార్టీల కార్యకర్తలు ఏడుస్తున్నారని మంత్రి రోజా సెటైర్ వేశారు. టీడీపీ – జనసేన ఉమ్మడి జాబితా చూశాక 175 స్థానాలు కొడతామన్న ధీమాతో వైసీపీ శ్రేణుల్లో డబుల్ అయిందన్నారు. అందుకే సంబరాలు జరుపు కుంటున్నామని తెలిపారు. పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అన్న పవన్ కళ్యాణ్… పావలా షేర్ సీట్లు కూడా తీసుకోలేదన్నారు మంత్రి రోజా. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నారో ఆ పార్టీ కేడర్‎కు పవన్ కళ్యాణ్ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.

ఇది చదవండి: చంద్రబాబు వద్ద పార్టీ అసంతృప్తి నేతల బుజ్జగింపులు.

24 సీట్లకే ఎందుకు తల వంచారో కూడా పవన్ జనసేన కార్యకర్తలకు చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో చంద్రబాబు చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రోజా విమర్శించారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: