హైకోర్టు సంచలన తీర్పు..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో వివాదానికి సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా భారాస హయాంలో మంత్రి మండలి చేసిన సిఫార్సులను తిరస్కరిస్తూ గత ఏడాది సెప్టెంబరు 19న గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం జనవరి 13న ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల పేర్లతో కొత్త ప్రభుత్వం చేసిన సిఫార్సును, వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జనవరి 27న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అధికరణ 171(5) ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగిస్తున్నప్పుడు మంత్రిమండలి సహకారం, సలహాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. అయితే, మంత్రిమండలి సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హతలు, అనర్హతలను పరిశీలించే అధికారం గవర్నర్‌కు ఉందని పేర్కొంది. అదనంగా అవసరమైన పత్రాలు, సమాచారాన్ని సమర్పించాలని.. మంత్రిమండలి సిఫార్సులను పునస్సమీక్షించాలంటూ వెనక్కి పంపే అధికారమూ గవర్నర్‌కు ఉందని తేల్చిచెప్పింది. అధికరణ 361 ప్రకారం గవర్నర్ కోర్టుకు జవాబుదారీకాదని స్పష్టతనిచ్చింది. గవర్నర్‌కు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడంలేదని పేర్కొంది.
ఇది చదవండి: ముగిసిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి