పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభం:
దేశంలోనే తొలిసారి ఝార్ఖండ్ ప్రభుత్వం(Jharkhand Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన పేరుతో వితంత పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకున్న మహిళలకు ప్రభుత్వం 2 లక్షల ప్రోత్సాహకం అందిస్తుంది. అయితే, లబ్ధిదారులు వివాహ వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించదు. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు లబ్దిదారు పునర్వివాహ తేదీ నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దీంతో పాటు దివంగత భర్త మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మహిళలు సమాజంలో ఒంటరిగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని తెలిపారు. అలాంటి పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందన్నారు. వితంతువుల్లో ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, మహిళల పునర్వివాహం పట్ల సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని పేర్కొన్నారు.
ఇది చదవండి: భార్య భర్తల వివాదం పై ఢిల్లీ హై కోర్ట్ సంచలన తీర్పు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి