లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు:
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు(alliance in Lok Sabha elections) కోసం టీడీపీ-జనసేన(TDP-Jana Sena) అధినేతలు ప్రత్యక్షంగా బీజేపీ(bjp) తో సంప్రదింపులు జరుపుతున్న వేళ వైఎస్సార్‌సీపీ అగ్రనేత, ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన(TDP-Jana Sena) కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి, ఇప్పటికీ పెద్ద వ్యత్యాసం ఏముందని ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో మోసాలు, అబద్ధాలు, అమలుపరచని వాగ్దానాలను ఏపీ చవిచూసిందని అన్నారు. కొత్త ప్యాకేజీలో వస్తున్న పాత ఉత్పత్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 కాళ్ల కుర్చీ నిలబడదని, సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ(YSRCP)కి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి