అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం నియోజకవర్గం, పి.గన్నవరం మండలం
పి గన్నవరం(P.Gannavaram) గరుడేశ్వర స్వామి ఆలయమునకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ మంతటా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు. పి గన్నవరం గరుడేశ్వర స్వామి ఆలయమునకు(Garudeshwara Swamy Temple) మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారి దర్శనమునకు బారులు తీరిన భక్తులు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వయంభువు గా వెలసిన శ్రీ గరుడేశ్వర స్వామి ఆలయమునకు ఒక ప్రత్యేకత ఉంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం విశిష్టత.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పూర్వకాలమున ఒక గరుడ పక్షి ఒక శివలింగమును తీసుకొచ్చి వైనతేయ నది ఒడ్డున పడవేసిందని అది గమనించిన ఒక ముని అది అతి విశిష్టత కలిగిన శివలింగం అని ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చి జార విడిచింది అంటే ఇక్కడ ఏదో విశిష్టత ఉంది అని ఒక గరుడ తీసుకొచ్చిన లింగం కాబట్టి గరుడేశ్వర లింగంగా దానిని ప్రతిష్టించి అప్పటినుంచి ఇప్పటివరకు పూజలు హోమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. సాక్షాత్తు పరమేశ్వరుడు గరుడచేత తన ప్రతిమను పంపినందుకుగాను ఈ గ్రామం నకు గరుడవరం అని కూడా పేరు ఉండేది కాలక్రమమైన అది గన్నవరం గా మారింది అని ఇక్కడ స్థానికులు చెబుతుంటారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ వైయస్సార్ సిపి ఇన్చార్జ్ విప్పర్తి వేణుగోపాల్ రావు సతీసమేతంగా గరుడేశ్వర స్వామి దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి