రాష్ట్రంలోని రాజకీయ నేతల్లో ఒకటే చర్చ అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అని. ఒకరు ఆ నియోజకవర్గం అంటుంటే మరొకరు ఈ నియోజకవర్గం అని, ఎవరికి నచ్చినట్లు వారు పవన్ కళ్యాణ్ ను బరిలో దింపేస్తున్నారు. అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిన చోటే మళ్లీ పోటీ చేస్తారా లేక కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అసలు పవన్ దారి ఎటు ! తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించని పవన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి మంచి జోరుగా సాగుతుంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన(Janasena) కూటమి వైసీపీని ఎన్నికల బరిలో ఓడించేందుకు బలమైన అభ్యర్థులను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే కూటమిలో 99 సీట్లను ప్రకటించారు. రెండవ జాబితా కూడా త్వరలో ప్రకటించబోతున్నారు. టీడీపీ, జనసేన రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తామని ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్రంలో టీడీపీ ఇటు జనసేన కార్యకర్తల్లో మంచి జోష్ నెలకొంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు తాడేపల్లిగూడెం వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వరస పర్యటనలు చేస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. జనసేన టీడీపీ కూటమిలో మొదటి జాబితా విడుదల చేసిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(chandra babu) తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అంటూ అటు జనసేన టీడీపీ(TDP) కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 2014లో టీడీపీ, బీజేపీ తో కలిసి పవన్ కళ్యాణ్ పని చేశారు. అయితే 2014 ఎన్నికల్లో జనసేన ఎక్కడ పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీకే మద్దతు ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేనకు అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడి విడిగా పోటీ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో భీమవరం, గాజువాకల(Gajuwaka)లో రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ పోటీ చేశారు. అయితే రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీయడంతో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఘోర ఓటమి చవిచూశారు.
Pawan Kalyan | ఓటమి కి కారణం అదేనా..?
2019 ఎన్నికల్లో సొంత జిల్లాలో పోటీ చేసిన పవన్ మొదటిసారి ఓటమి నీ రుచి చూశారు.. రాష్ట్రంలో భీమవరం నియోజకవర్గం(bhimavaram constituency)లో జనసేన అధినేత పవన్ పోటీ చేయడంతో రాష్ట్రమంతా భీమవరం వైపే చూసింది.. భీమవరంలో పవన్ గెలుస్తారని అనుకున్న రాజకీయ విశ్లేషకుల లెక్కలు ఒక్కసారిగా తల్లక్రిందులయ్యాయి.. నన్ను ఎవడ్రా ఆపేది, నేను సినిమా రంగాన్ని సాసిస్తా, నాకు ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకున్నా పవన్ కు భీమవరంలో ఓటమి గుణపాఠాలుగా మారాయి… 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భీమవరంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు పై పవన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు… ఒక రాష్ట్ర పార్టీ అది నేత అటు సినిమా రంగం, ఇటు రాజకీయ రంగం లో దేశవ్యాప్తంగా మంచి పేరుగాంచిన పవన్ కళ్యాణ్ ఒక సాధారణ వ్యక్తిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారని రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేగడమే కాకుండా ప్రతిపక్ష నేతలకు రాజకీయ విమర్శలకు అస్త్రాలు అయ్యాయి.. 2019లో జరిగిన ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ కు క్యాడర్ లేకపోవడం గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలోపేతం కాకపోవడం, సొంత సామాజిక వర్గమే పవన్ కు వ్యతిరేకంగా పనిచేయడం వల్లే పవన్ కళ్యాణ్ ఓటమికి కారణమని అప్పట్లో టాక్ నడిచింది. ముఖ్యంగా రాష్ట్రమంతా తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సభల్లో వచ్చిన ప్రజాదరణ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని అనుకున్న పవన్ కనీసం తన సీటు కూడా నెగ్గించుకోలేకపోయాడని విమర్శలు వెళ్లువేత్తాయి…
గత ఓటమిని గుణపాఠంగా చేసుకుని ఈసారి పక్కాగా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళతారు అనుకున్నా పార్టీ క్యాడర్ ను పవన్ కళ్యాణ్ నిరాశ పరిచారని చెప్పాలి భీమవరంలో పర్యటించిన పవన్ పార్టీ క్యాడర్(party cadre) తో సమావేశమయ్యారు అందరూ ఊహించినట్టే భీమవరంలో పోటీ చేస్తారు అందుకనే పవన్ కళ్యాణ్ భీమవరం లో పర్యటించి టీడీపీ జనసేన నేతలతో సమావేశం అయ్యారని అటు జనసైనికులు ఇటు టీడీపీ శ్రేణులు కూడా భావించారు.. అయితే… పవన్ కళ్యాణ్ భీమవరంలో కార్యకర్తలతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేసారే తప్ప తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా నిరాశకు గురి అయ్యారు… అయితే రెండో జాబితాలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తారా అంటూ అటు ప్రజలు ఇటు రాజకీయ నేతలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు … ఒకరు భీమవరంలో పోటీ చేస్తారు అంటే మరొకరు తిరుపతి నుంచి పోటీ చేస్తారని మరి కొంతమంది ఈస్ట్ గోదావరిలోని పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఎవరికి వారే పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలను కూడా ప్రకటించేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ మాత్రం తనకి ఏమీ పట్టినట్లు టిడిపి జనసేన కూటమి లోకి బిజెపి(BJP)ని చేర్చేందుకు ఢిల్లీ పర్యటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
భీమవరమా..? పిఠాపురమా..?
ముఖ్యంగా పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ముందుగా ఎంచుకొని ఆ నియోజకవర్గంలోని ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా వైసిపి చేసిన తప్పులను ఎండగడుతూ నియోజకవర్గంలో కుల, మత, సామాజిక వర్గాలను కలుపుకొని అక్కడ ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసానిచ్చి ఎన్నికల్లో నిలబడితే పక్కా విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఇప్పటివరకు ఆలోచన చేయని పరిస్థితి. కనీసం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి… కనీసం పవన్ కళ్యాణ్ ముందుగానే తాను పోటీ చేసే నియోజకవర్గం ప్రకటిస్తే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా జనసేన నేతలు నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేస్తారని… అప్పటికప్పుడు సీటు ప్రకటిస్తే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంటుందని పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలను ముందుగానే ప్రకటించాలని పవన్ సన్నిహితులు వాపోతున్నారట… అసలు పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తారా, పిఠాపురంలో పోటీ చేస్తారా అసలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న సందిగ్ధత రాజకీయ వర్గాల్లో నెలకొంది..
ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా రాష్ట్ర నాయకుడిగా కాకుండా ఒక నియోజకవర్గ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళితే ఈసారి విజయం తధ్యమని, గత ఓటమిని సవాల్ గా చేసుకుని తాను పోటీ చేసే నియోజకవర్గం ముందుగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలబడితే ఈసారి ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది..
ఎండ్… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిన భీమవరంలోనే తిరిగి పోటీ చేస్తారా, లేక వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేక అస్సలు పోటీ చేయకుండా కూటమి నీ అధికారం లోకి తీసుకు వచ్చే దిశగా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజలను, శ్రేణులను సంసిద్ధం చేస్తారా అని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి