SBI పిటిషన్.. నేడు ఎన్నికల బాండ్ల కేసులో విచారణ:
ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds) వివరాలను ఈసీ(EC)కి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) దాఖలు చేసిన పిటిషన్(Petition)పై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్(Chief Justice Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టనుంది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించేందుకు తుది గడువును జూన్ 30 వరకూ పొడిగించాలని కోరుతూ SBI సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ బద్ధం కాదంటూ సుప్రీం కోర్టు గత నెలలో తీర్పు వెలువరించింది. బాండ్ల జారీని తక్షణం నిలిపివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతే కాకుండా, బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు అందిన సొమ్ము, దాతల వివరాలను ఈ నెల 13లోగా ఈసీ ముందుంచాలని ఆదేశించింది. అయితే, ఈసీకి ఈ సమాచారం సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని SBI పిటిషన్ దాఖలు చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నోవాటెల్ హోటల్ కి చంద్రబాబు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి