బెంగళూరు(Bengaluru)లో తీవ్ర స్థాయికి చేరిన నీటి కరువు..
బెంగళూరు(Bengaluru) వాసుల నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. బోర్లు ఎండిపోవడంతో గుక్కెడు తాగునీటికీ జనం ఇబ్బంది పడుతున్నారు. సిటీ అంతటా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోక ప్రతీ నీటి చుక్కనూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు. గొంతు తడుపుకోవడానికే సరిగా నీళ్లు దొరకక ఇబ్బంది పడుతుండడంతో వంట పాత్రలు కడగలేక ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నామని చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లో తాను కేవలం ఐదు సార్లు మాత్రమే స్నానం చేశానని ఓ టెకీ చెప్పాడంటే నీటి కరవు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సందట్లో సడేమియాలాగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ సప్లైదారులు రేట్లు పెంచడంతో ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వాటర్ ట్యాంకర్ కు రేటు ఫిక్స్ చేసి, అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో పరిస్థితి కాస్త చక్కబడుతుందని భావించిన జనాలకు కొత్త సమస్య ఎదురైంది. ప్రభుత్వం కల్పించుకోవడంతో వాటర్ ట్యాంకర్ సప్లయర్లు ట్యాంకర్లను తగ్గించారని జనం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా.. ఆ ట్యాంకర్ ఎప్పుడొస్తుందో తెలియట్లేదని, ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేందుకు అవకాశం కల్పించలేదని విమర్శిస్తున్నారు.
ఇది చదవండి: బెంగళూరులో ఎన్నడూ లేనంతగా నీటి కొరత.. డీకే శివకుమార్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి