Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home National బెంగళూరులో ఎన్నడూ లేనంతగా నీటి కొరత.. డీకే శివకుమార్

బెంగళూరులో ఎన్నడూ లేనంతగా నీటి కొరత.. డీకే శివకుమార్

by Satya
DK Sivakumar

బెంగళూరులో తాగునీటి కష్టాలు..

బెంగళూరు(Bengaluru) మహానగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి కనిపిస్తోంది. నీటి కొరత సంక్షోభం స్థాయికి చేరుకుంది. కొద్దిపాటి నీరు దొరికినా చాలు అదే మహా భాగ్యం అని బెంగళూరు(Bengaluru) వాసులు భావిస్తున్నారు. బెంగళూరు(Bengaluru)లో 13వేలకు పైగా బోర్లు ఉండగా, వాటిలో 7వేల వరకు ఎండిపోయాయి. దాంతో నీటికి కటకట ఏర్పడింది. వేసవిలో ఈ పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Sivakumar) స్పందించారు.

గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు…

రాష్ట్రంలో నీటి కోసం అలమటించి పోయే పరిస్థితులు గత 40ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపారు. నీటి కొరతను తీర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా వాటర్ మాఫియాకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బెంగళూరు (Bengaluru)నగరంలో నీటికి డిమాండ్ అధికంగా ఉన్న దృష్ట్యా నీటి ధరలు ప్రామాణికంగా ఉంచేందుకు చర్యలు ప్రారంభించామని డీకే శివకుమార్(DK Sivakumar) తెలిపారు. వాటర్ ట్యాంకర్ల యజమానులు అధికారుల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించామని, ఇప్పటి దాకా 15 వందల ట్యాంకర్ల యజమానులు వివరాలు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మాల్దీవుల పర్యాటకం పై ప్రతికూల ప్రభావం…


అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.
లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి. నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే …
ఐజీఐ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె కలకలం.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి …
NEET రద్దుకు తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.
నీట్ రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ మరోసారి గళమెత్తింది. దేశవ్యాప్తంగా NEETను రద్దు చేయాలని కోరుతూ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: