సుప్రీంకోర్టు(Supreme Court):
సుప్రీంకోర్టులో కుక్‌గా ఉన్న అజయ్ కుమార్ కూతురు ప్రజ్ఞను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సన్మానించారు. అమెరికాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ స్కాలర్‌షిప్‌లు పొందిన ప్రజ్ఞను జడ్జిల లాంజ్‌లో స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందించారు. తనంతట తానుగా ప్రజ్ఞ ఈ ఘనత సాధించిందని.. ఆమెకు కావాల్సినవన్నీ అందించేందుకు మేము అన్ని రకాలుగా సాయం చేస్తామని జస్టీస్ చంద్రచూడ్ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మళ్లీ ప్రజ్ఞ స్వదేశానికి తిరిగొచ్చి దేశసేవ చేయాలని ఆశిస్తున్నామని తెలిపారు. తను ఎంచుకున్న రంగంలో ఆమె అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. భారత రాజ్యాంగానికి సంబంధించి సుప్రీం న్యాయమూర్తులందరూ సంతకాలు చేసిన మూడు పుస్తకాలను ప్రజ్ఞకు బహూకరించారు. అనేక కష్టనష్టాలకోర్చి కూతురిని పెంచి పెద్ద చేసిన ప్రజ్ఞ తల్లిదండ్రులను కూడా శాలువా కప్పి సన్మానించారు.
ఇది చదవండి: మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం.. డీకే అరుణ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి