ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు..
తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt).. ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు(Enforcement of guarantee) చేస్తూ నేటితో వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సు(RTC bus)ల్లో ఉచిత ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ కింద 10లక్షల దాకా చికిత్సను అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy).. ఎన్నికల ప్రచారంలో మాటిచ్చిన విధంగానే తొలి రోజునే ప్రగతిభవన్ ముందున్న కంచెను తొలగించేలా చర్యలు చేపట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విధ్వంసానికి గురైన వ్యవస్థలను ఒక్కటొక్కటిగా చక్కదిద్దుతూ మొదటి వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఔటర్ రింగ్‌రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించడంతోపాటు గొర్రెల పంపిణీ చేపపిల్లల పథకాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీతోపాటు మిషన్ భగీరథ పనులపై విచారణ చేపట్టడం ద్వారా అవినీతిపై ఉక్కుపాదం మోపింది. వారంలో రెండు రోజుల పాటు ప్రజలు తమ సమస్యలను నివేదించుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
ఇది చదవండి: గుండ్లపల్లి-పొత్తూరు రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి