ఈ ఆలయంలో రకరకాల శిల్పాలు…
ఈ ఆలయంలో రకరకాల శిల్పాలు(Sculptures) దర్శనమిస్తాయి. ఒక్కసారి ఈ శిల్పాలను చూసినట్లయితే అవి నిజమైనవా? లేదంటే ఒక ఆకారాన్ని తయారు చేసి అక్కడ కూర్చో బెట్టారా? అని తెలుసుకోవడం కష్టమే. ఈ గుడి ఆవరణంలో చాలా శిల్పాలు ఉన్నాయి. వాటన్నింటిని చూడడానికి భక్తులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. శ్రీ విష్ణునంది గుడికి ఎదురుగా పాలరాయితో నంది విగ్రహాం చూపురులను ఆకట్టుకుంటుంది. ఎక్కడ కూడా ఒక చిన్న తేడా లేకుండా పాలరాయితో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి సపరేటుగా ఒక గుడిని నిర్మించారు. ఆ పాలరాయితో చేసిన నందిని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ పరమశివుడే కైలాసం నుంచి దిగి వచ్చి ఈ నంది విగ్రహాన్ని తయారు చేశాడా అన్నట్లుగా ఉంటుంది. ఆ నంది విగ్రహానికి ప్రాణం ఉంటే ఏ విధంగా ఉంటుందో అంతేచూడముచ్చటగా, అందరినీ కనువిందు చేస్తోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఒక్కసారిగా ఆ విగ్రహం వైపు చూసినట్లయితే నిజమైన నంది అన్నట్లుగా ఉంటుంది. ఈ పాలరాతి నంది నిజమైన ఆవు అని భావించి పులి దాడి చేసిందనే కథను ఇక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ గుడిలో నందీశ్వరుని పాలరాయితో చేయడం విశిష్టత. దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ఏ శివాలయంలోను పాలరాయితో చెక్కిన నంది విగ్రహం ఎక్కడ మనకు దర్శనం ఇవ్వదు. ఓంకార క్షేత్రం నుంచి మహానందికి వెళ్తున్న రోడ్డు మార్గంలోశ్రీ విష్ణునంది గుడి ఎదురుగా ఈ పాలరాయితో చెక్కబడిన నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి శివరాత్రి సమయాలలో వేలాది మంది భక్తాదులకు పాలరాయితో చెక్కిన నందిదర్శనం ఇస్తుంది. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం వెళ్లే రోడ్డు మార్గంలో శ్రీ విష్ణు నంది దేవాలయం, ఎంతో ప్రాముఖ్యత చెందిన గుడిగా చెప్పవచ్చు.
ఇది చదవండి: Arasavelli: స్వామివారి పాదాలను తాకని సూర్య కిరణాలు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి