అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)
అందరూ ఊహించిన విధంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ -ఈడీ (Enforcement Directorate -ED) అధికారులు అరెస్ట్ చేశారు. సాయంత్రం రెండు బృందాలుగా ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న అధికారులు… రెండు గంటల పాటు సుదీర్ఘంగా సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు ఆప్ లీగల్ టీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు… సిఎం కేజ్రీవాల్ అరెస్ట్ ను ఇండియా కూటమి తీవ్రంగా ఖండించింది. దేశంలోని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి