మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు..
ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) భారత్(India)తో సయోధ్యకు వచ్చారు. గతేడాది నవంబర్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్న ఆయన తాజాగా రుణ సాయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల రుణ విముక్తిలో భారత్ అండగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మాల్దీవులకు భారత్ సన్నిహిత భాగస్వామ్య దేశంగా కొనసాగుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని మహ్మద్ ముయిజ్జు అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మాల్దీవులకు సాయం అందించడంలో ఇండియా కీలకపాత్ర పోషిస్తోందని, ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసిందని ఆయన ప్రస్తావించారు. భారీ రుణాల చెల్లింపులో మాల్దీవులకు ఉపశమన చర్యలు కల్పించాలని భారత్‌ను కోరారు. వారసత్వంగా కొనసాగుతున్న విధానంలో భారత్ నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో రుణాలు పొందామని, ఈ రుణాల చెల్లింపులో మినహాయింపుల కోసం ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.
ఇది చదవండి: తమిళనాడు గవర్నర్ రవికి సుప్రీంకోర్టు చివాట్లు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి