పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసేంత వరకు… సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి.హరీష్ ఈ అంశంపై మాట్లాడారు. పాకిస్తాన్‌ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పేర్కొన్నారు. 1960లో మంచి ఉద్దేశంతో ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసినప్పటికీ, గత ఏడాది జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారత్ దీనిని నిలిపివేసింది. దీనిపై పాకిస్థాన్ పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టినప్పటికీ భారత్ మాత్రం తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూనే ఉంది. తాజాగా మరోసారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్ ఈ అంశంపై అక్కసు వెళ్లగక్కింది. అయితే భారత్ కూడా అదే స్థాయిలో దాయాదికి దీటుగా జవాబిచ్చింది.
India
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం, కేవలం గత వారం రోజుల్లోనే మార్చి 1 నుండి 7 వరకు దాదాపు 67,000 మంది భారతీయులను ప్రత్యేక విమానాలు, వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చారు. ఇందులో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తెలంగాణ నుండి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అంచనా. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, గల్ఫ్ దేశాల్లోని వివిధ తెలుగు సంఘాలతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవాస ఆంధ్రుల భద్రత కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు * ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ రంగంలోకి దిగింది. ఇప్పటికే బహ్రెయిన్ , దుబాయ్‌లో చిక్కుకుపోయిన సుమారు 107 మందిని ప్రత్యేక చొరవతో స్వరాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 మందికి పైగా వ్యక్తులు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సుమారు 100 మంది గుడ్‌విల్ అంబాసిడర్లు గల్ఫ్ దేశాల్లో తెలుగు వారికి వసతి , రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం విమాన ప్రయాణాలే కాకుండా, సముద్ర మార్గంలో చిక్కుకున్న నావికుల భద్రతపై కూడా దృష్టి పెట్టింది. ఢిల్లీలో 24/7 పనిచేసే స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్‌స్పేస్ పాక్షికంగా మూసివేసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారతీయులను తరలిస్తున్నారు. కువైట్ నుండి రియాద్‌కు రోడ్డు మార్గంలో తరలించి, అక్కడి నుండి విమానాల ద్వారా భారత్‌కు చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది.
ఉపాధి నిమిత్తం వెళ్ళిన వారి కంటే, విజిటింగ్ వీసాపై వెళ్ళిన వారు , విమానాశ్రయాల్లో చిక్కుకున్న వారు స్వదేశానికి తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోనే ఉండి పనిచేస్తున్న వారు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారని, అయితే స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని రాయబార కార్యాలయాలు సూచిస్తున్నాయి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ భవన్ల ద్వారా కూడా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, యుద్ధం తీవ్రతరం అయితే భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. యుద్ధ క్షేత్రం నుండి తిరిగి వస్తున్న వారిని చూసి గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో కొంత ఉపశమనం కనిపిస్తున్నా, అక్కడ ఉండిపోయిన వారి గురించి ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది.
పశ్చిమాసియాలో భీకర యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో భారత్‌కు భారీ ఊరట లభించింది. రష్యా ముడి చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాత్కాలికంగా 30 రోజుల పాటు రష్యా ఆయిల్ కొనేందుకు భారత్‌కు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ఆంక్షలు సడలిస్తున్నామని..ఇరాన్ చర్యల వల్ల ఏర్పడిన పరిస్థితిని అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీంతో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా అవుతుందన్నారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఆ దేశానికి ఆర్థికపరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అన్న బెసెంట్.. భవిష్యత్తులో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. వెస్టిండీస్ సెమీస్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ గెలుపుతో భారత్ సెమీస్‌కు చేరింది. భారత జట్టు బ్యాటర్లలో సంజూ శాంసన్ (97), సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా(17), శివమ్ దూబే(8)తో రాణించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ రెండు వికెట్లు, అకేల్ హోసేన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (40), జాసన్ హోల్డర్ (37*), రోమన్ పావెల్ (34*), షై హోప్ (32), షిమ్రాన్ హెట్మయెర్ (27), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (14) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2.. హార్దిక్, వరుణ్ తలో వికెట్ తీశారు.
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలిద్ రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. సమావేశంలో ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతంపై దృష్టిసారించారు. ఇక అబుదాబి యువరాజు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. భారత్ కు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్. దీంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. భారత్, యూఏఈ మధ్య రాజకీయ, పెట్టుబడి, సాంకేతికత, విద్య, వాణిజ్యం, ఇంధనంతో పాటు వివిధ రంగాలలో మంచి సహకారం ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాలు చారిత్రాత్మక సన్నిహిత సంబంధాలను కొనసాగించడం జరుగుతుందని చెప్పుకొచ్చింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‌తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా(America) రాయబారి ఎరిక్ గార్సెటీ కీలక వ్యాఖ్యలు..
అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్(India)లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ(Eric Garcetti) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాంటి భారీ దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, విద్యార్థులు నిత్యం అప్రత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో నేను మాట్లాడాను. వారి పరిస్థితికి నా హృదయం ద్రవించిందని తెలిపారు.
ఇది చదవండి: UNSC : గాజాలో కాల్పుల విరమణ..!
ఇలాంటి విషయాలను మేము సీరియస్‌గా తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపిన ఆయన బాధితులకు న్యాయం లభించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అయితే దాడుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ దిశగా యూనివర్సిటీల్లోని వనరులను వినియోగించుకోవాలని ఎరిక్ కోరారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు..
ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) భారత్(India)తో సయోధ్యకు వచ్చారు. గతేడాది నవంబర్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్న ఆయన తాజాగా రుణ సాయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల రుణ విముక్తిలో భారత్ అండగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మాల్దీవులకు భారత్ సన్నిహిత భాగస్వామ్య దేశంగా కొనసాగుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని మహ్మద్ ముయిజ్జు అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మాల్దీవులకు సాయం అందించడంలో ఇండియా కీలకపాత్ర పోషిస్తోందని, ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసిందని ఆయన ప్రస్తావించారు. భారీ రుణాల చెల్లింపులో మాల్దీవులకు ఉపశమన చర్యలు కల్పించాలని భారత్‌ను కోరారు. వారసత్వంగా కొనసాగుతున్న విధానంలో భారత్ నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో రుణాలు పొందామని, ఈ రుణాల చెల్లింపులో మినహాయింపుల కోసం ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.
ఇది చదవండి: తమిళనాడు గవర్నర్ రవికి సుప్రీంకోర్టు చివాట్లు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
భారత్(India)లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు:
భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు(Metro Rail) పరుగులు పెట్టింది. పశ్చిమబెంగాల్(West Bengal) రాజధాని కోల్‌కతా(Kolkata) లో నిర్మించిన తొలి అండర్‌వాటర్ మెట్రో టన్నెల్(Underwater Metro Tunnel) మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ఎస్ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు. నదీగర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు. దీంతో పాటు పశ్చిమబెంగాల్(West Bengal)లో పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ నేడు ప్రారంభించారు.
దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు..
దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు(Metro Rail) పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్(Underwater Metro Tunnel) నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు(Metro Rail) కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బెంగళూరులో బాంబు పేలుడు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్ కు షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు ఈ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ కు ఓ విశిష్టత ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ లో క్వాలిఫయర్ టీమ్ లో సందడి చేయనున్నాయి. ఇక వరల్డ్ కప్ అంటే అందరూ ఆశించేది భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరాన్నే. ఈ టోర్నీలో దాయాది జట్లు రెండూ ఏ-గ్రూపు లో ఉన్నాయి. జూన్ 9న న్యూయార్క్ నగరంలో ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. ఏ-గ్రూపు లో భారత్, పాక్ తో పాటు ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లు ఉన్నాయి.టీమిండియా తన గ్రూప్ మ్యాచ్‌లు అన్నింటినీ అమెరికా గడ్డపై ఆడనుంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై మరోమారు ప్రశంసలు కురిపించారు. పాక్ చుట్టూ ఉన్నా దేశాలు చంద్రుడిని అందుకుంటుంటే మనం మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఇస్లామాబాద్‌లో తన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ కేడర్‌తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక దుస్థితి గురించి మాట్లాడుతూ దీనికి కారణం దేశమేనని పేర్కొన్నారు. మన పొరుగువారు చంద్రుడిని చేరుకున్నారు. మనం ఈ భూమ్మీదే ఎదగలేకపోతున్నాం. ఇది ఇలాగే కొనసాగదు అని చెప్పుకొచ్చారు. మన పతనానికి మనమే కారణమని, లేదంటే ఈ దేశం ఈ పాటికి ఎక్కడో ఉండేదని పేర్కొన్నారు.
2013లో దేశం తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటే మనమొచ్చి దానిని పరిష్కరించామని, దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపి కరాచీలో శాంతి నెలకొల్పామని, రహదారులు నిర్మించామని, చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ వచ్చిందని, అభివృద్ధిలో నూతనశకం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. దేశంలో నెలకొన్న సంక్షోభాలకు ఎవరిని నిందించాలని, మన కాళ్లను మనమే నరుక్కున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వ హయాంలో దేశంలో ఆబ్‌పరా, ఇస్లామాబాద్‌లో 2 పాకిస్థానీ రూపాయలకే రొట్టె లభించేదని, కానీ ఇప్పుడది 30 రూపాయలకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.





Total views : 38508