తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా సేవలందించేందుకు ఏర్పాటు చేసిన కొత్త “రైతు డిస్కం” జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభం కానుంది. పూర్తిస్థాయి సిబ్బందితో ఈ సంస్థ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజాగా రైతు డిస్కంకు సంబంధించిన అధికారిక లోగోను కూడా విడుదల చేశారు. లోగోలో సౌర, జల, పవన విద్యుత్ చిహ్నాలతో పాటు వ్యవసాయ పంటల నేపథ్యాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు. ఈ సంస్థకు సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఉత్తర, దక్షిణ డిస్కంల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ప్రత్యేకంగా వేరు చేసి రైతు డిస్కం పరిధిలోకి తీసుకువచ్చారు. గత ఐదేళ్ల విద్యుత్ వినియోగ గణాంకాల ఆధారంగా కొత్త డిస్కంకు మొత్తం విద్యుత్ పంపిణీలో 42 శాతం వాటాను ప్రభుత్వం కేటాయించింది.వ్యవసాయ విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రైతు డిస్కం ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్ల ఖచ్చితమైన వివరాలు, వాటి స్థానాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు.
జూన్ 2న అధికారికంగా ప్రారంభం కానున్న రైతు డిస్కం..
46
previous post






Total views : 89042