Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home International ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..

by CVR NEWS
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జరిగిన అత్యంత భీకర దాడులు ఇవేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.లెబనాన్‌లోని పలు గ్రామాలు, నివాస ప్రాంతాలు, హెజ్‌బొల్లా అనుమానిత స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. లెబనాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపించింది.హెజ్‌బొల్లా మిలిటెంట్లు తమ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు ప్రయోగించారని , దానికి ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్‌బొల్లా స్థావరాలు, ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది. తాజా దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని సూచించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: