ఓ వ్యాపారి కిడ్నాప్ ప్లాన్‌కు తాడ్వాయి పోలీసులు చెక్ పెట్టారు. అక్రమ తుపాకీ, రబ్బర్ బుల్లెట్లతో రెడీ అయిన ఆరుగురు కిరాతకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. కామారెడ్డికి చెందిన భూసా శ్రీనివాస్ వద్ద భారీగా నగదు ఉందని పసిగట్టిన నిట్టు నర్సింగరావు ముఠా కిడ్నాప్‌కు తెగబడింది. పాత లావాదేవీల పగతో పక్కా ప్లాన్ రచించారు. ఇందుకోసం మహారాష్ట్ర నుంచి అక్రమ తుపాకీని రూ.30 వేలకు బేరం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.27 వేలు చెల్లించారు. కృష్ణాజీవాడి శివాలయం దగ్గర మాటు వేసిన ముఠా, పోలీసుల రాకతో షాక్‌కు గురైంది. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్సై నరేశ్ టీమ్, పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకుంది. ఇప్పటికే హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న నిట్టు నర్సింగరావు మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రి చూస్తే వీరి ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతోందని ఎస్పీ తెలిపారు. ఫైర్ ఆర్మ్, 5 రబ్బర్ బుల్లెట్లు, ఎయిర్ రైఫిల్ పెల్లెట్లు, 5 సెల్‌ఫోన్లు, మంకీ క్యాప్స్, మాస్కులు, నైలాన్ తాడు, గాగుల్స్, బైక్ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగరావు, సూరం స్వామి, సంతాయిపేట్‌కు చెందిన వడ్డె స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన తుపాకీ సప్లయర్స్ వైభవ్ ప్రకాశ్, అజయ్ గోంగపాలేలను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మారుతి మోకే కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై ఆర్మ్స్ యాక్ట్, బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, నేరగాళ్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కామారెడ్డిలో వ్యాపారి కిడ్నాప్ ప్లాన్‌కు చెక్ పెట్టిన తాడ్వాయి పోలీసులు..
51
previous post






Total views : 89056