54
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపుదిద్దుకుంటోంది. రంగారెడ్డి జిల్లాలో సాగుతున్న పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు పరిశీలించారు. ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, FCDA కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తెలిపారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో స్కిల్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించబోతుందని పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నామని వివరించారు.






Total views : 89056