Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Latest News భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..

by CVR NEWS
భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి, సీతమ్మవారికి, లక్ష్మణస్వామికి ప్రత్యేక పూజలు చేశారు సీతక్క. దర్శనానంతరం ఆలయ మండపంలో అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని బహూకరించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శ్రీరాముడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అలాగే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరంపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై చర్చించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: