Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News భారతదేశం గర్వించదగ్గ గొప్పనాయకుడు ఎన్టీఆర్ -సీఎం రేవంత్..

భారతదేశం గర్వించదగ్గ గొప్పనాయకుడు ఎన్టీఆర్ -సీఎం రేవంత్..

by CVR NEWS
భారతదేశం గర్వించదగ్గ గొప్పనాయకుడు ఎన్టీఆర్ -సీఎం రేవంత్

భారతదేశ చరిత్రలో ఎప్పటికీ స్మరించుకోవాల్సిన గొప్ప నేతల్లో ఎన్టీఆర్ ఒకరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయి స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశం ఉన్నంత కాలం, మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ ముగ్గురు జాతిరత్నాల కీర్తి, ప్రతిష్టలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం ఉన్న నేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. హైదరాబాద్‌లోని మైత్రీవనం చౌరస్తాలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాజకీయ ప్రముఖులు, సినీ దర్శక నిర్మాతలు, భారీ సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018645
Total views : 89068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.