Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…

by CVR NEWS
చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం

అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు, సీఆర్డీఏ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులు, అభివృద్ధి ప్రాజెక్టులు , భవిష్యత్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చ జరిగింది. అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడం, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అభివృద్ధిని సమగ్ర ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: