Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

by CVR NEWS
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి .10th లో 582 మార్కులు సాధించిన విద్యార్థిని భవిత..తన ఆర్ధిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పాలిసెట్ లో 634 వ ర్యాంక్ సాధించానని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపే లాస్ట్ డేట్ అని వీడియోలో విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీడియో చూసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చలించిపోయారు. ఉదయమే తన కార్యాలయ సిబ్బందిని అలెర్ట్ చేసి,..విద్యార్థిని వివరాలు ఆరా తీసిన మంత్రి కోమటి రెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ తో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. విద్యార్థిని సర్టిఫికెట్స్ తో సహా ఉదయం 10గంటల లోపు మినిస్టర్ క్వార్టర్స్ రావాలని మంత్రి సూచించారు. మంత్రి వద్దకు వచ్చిన విద్యార్థిని భవితను.. దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించిన మంత్రి..భవిష్యత్ లో ఏమవుతావని ఆరా తీశారు. అక్కడికక్కడే ప్రిన్సిపాల్ కు స్కూల్ ఫీజు 60వేలు రూపాయలు చెల్లించి,విద్యార్థినికి సర్టిఫికెట్స్ ఇప్పించారు. విద్యార్థిని తక్షణ ఖర్చుల నిమిత్తం మరో 20 వేలు రూపాయలను మంత్రి కోమటి రెడ్డి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. మానవత్వం ఉన్న ప్రతి మనిషి దేవునితో సమానమన్న ఆయన…ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉన్నత చదువులకు అండగా ఉంటానని విద్యార్థిని భవితకు ధైర్యం చెప్పిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి విద్యార్థిని భవిత కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018845
Total views : 89510

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.